GNTR: రాజధాని అమరావతిలో అమృత విశ్వవిద్యాపీఠం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన నూతన క్యాంపస్ మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. అమరావతిలో సుమారు 150 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక క్యాంపస్‌ను నిర్మించనున్నారు. రాజధానిలోకి ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థల రాకతో ఇక్కడి విద్యార్థులకు మరింత మెరుగైన ఉన్నత విద్యావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.