SS: అమరావతిలో జరుగుతున్న శాసనసభ్యుల క్రీడా మహోత్సవం ‘ఆట విడుపు’లో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సందడి చేశారు. బుధవారం జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఆమె పాల్గొని ఉత్సాహంగా బ్యాటింగ్, బౌలింగ్ చేశారు. నిత్యం రాజకీయాలు, పాలనా వ్యవహారాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు ఈ క్రీడలు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయని మంత్రి పేర్కొన్నారు.