E.G: ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లు అర్హులైన వారందరికీ అందిస్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం కోలమూరులో కొత్తగా మంజూరైన నూతన పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు పింఛన్ ఇచ్చే విధానాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు.