ATP: TDP వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడుతున్న మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్యే పరిటాల సునీత అభినందనలు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషికి ఇది తగిన గుర్తింపు అని పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆయన నాయకత్వంలో టీడీపీ మరింత దృఢంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.