ప్రకాశం: కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్ అనే వ్యక్తి మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.