శ్రీలంక ఆల్రౌండర్ దాసున్ శనకపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. 2027లో జరగబోయే పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి అతడిని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. 2026-PSL సీజన్ కోసం లాహోర్ ఖలందర్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న శనక, టోర్నీ ప్రారంభానికి ముందే ఐపీఎల్ కోసం PSL నుంచి తప్పుకున్నాడు. దీంతో PCB అతడిపై ఏడాది నిషేధం విధించింది.