NLR: రాపూరు గ్రామదేవత శ్రీ రాపూరమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమాన్ని ఈనెల 24,25,26 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, అమ్మవారి అలంకరణలు, గ్రామోత్సవ శోభాయాత్రలు, భక్తి కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తామన్నారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.