బాపట్లలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రూరల్ CI ప్రభాకర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడకం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని చెప్పుకొచ్చారు. వినియోగం లేదా అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ లేని సమాజం కోసం అందరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ సెల్ అధికారి విక్టర్, SI అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.