VSP: ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 22వ తేదీన నిర్వహించనున్నట్టు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర మంగళవారం తెలిపారు. ఈ సమావేశాలకు జడ్పీటీసీ సభ్యులు, సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైన సమస్యలపై చర్చించనున్నట్లు ఆమె వెల్లడించారు.