BHNG: దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రిమాలలోని ప్రజల ప్రాణాలను బలిగొంటున్న కెమికల్ పరిశ్రమలను తక్షణం తోలగించాలని CPI(M) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామపంచాయతీ ముందు సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో రసాయన పరిశ్రమలు తోలగించాలని నిరసన దీక్ష నిర్వహించారు.