విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రలో నటించింది. సెన్సార్ కారణాల వల్ల ఈ చిత్ర విడుదల వాయిదా పడగా, ఇటీవలే సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. ఈ ఘటనపై మమితా బైజు స్పందిస్తూ.. మూవీ లీక్ అయిందని తెలిసి తాను చాలా బాధపడినట్లు తెలిపింది. ఎంతో మంది కష్టపడి చేసిన పని ఇలా వృథా కాకూడదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.