NLG: చిట్యాల మండలం వట్టిమర్తిలో ఎండల తీవ్రత దృష్ట్యా వార్డు సభ్యుడు మేడి హరికృష్ణ మానవతా దృక్పథంతో ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. చెరువు పనుల్లో ఉన్న కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఈ జాగ్రత్తలు చేపట్టారు. సర్పంచ్ మేడి శ్రీలత శ్రీను, కార్యదర్శి పరమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూలీలు ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.