కోనసీమ: దేశ భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనలో కీలకమైన జనగణన విధులను పారదర్శకంగా, నిబద్ధతతో నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను బుధవారం ఆదేశించారు. ప్రస్తుతం స్వీయ గణన ప్రక్రియ కొనసాగుతోందని, మే నెలలో చేపట్టే క్షేత్రస్థాయి డేటా సేకరణలో ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదని స్పష్టం చేశారు. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ గణాంకాలను సేకరించాలన్నారు.