KRNL: వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో నివాభూప హెల్త్ ఇన్సూరెన్స్, ఓమిని హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు పోలీసులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సీఐ యుగంధర్ హాజరై శిబిరాన్ని పర్య వేక్షించారు. విధినిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీసులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.