NGKL: లింగాల మండల కేంద్రంలో ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా భవిష్య భారత్ మొబైల్ ఎక్స్రే ద్వారా క్షయ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. ప్రశాంత్, క్షయ పర్యవేక్షకుడు ఆరిఫ్ ఖాన్ మాట్లాడుతూ.. 14 ఏళ్లు పైబడిన వారు ఈ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ‘నిశ్చయ పోషణ్ యోజన’తో బాధితులకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం అందిస్తుందని వివరించారు.