WGL:పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన విష ప్రచారాలకు ఈ తీర్పుతో పూర్తి క్లారిటీ వచ్చిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కమిషన్ను ఉపయోగించారని ఆరోపించారు. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.