NLR: ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్ల చేత ఎంఈవో వెంకటేశ్వర్లు స్వీయగణన చేయించారు. ప్రతి టీచర్ ఇంటి వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. అనంతరం ఎంఈవో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ల నుంచి ఇంటి వివరాలను ఈనెలాఖరు లోపు నమోదు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డిస్టిక్ ఫీల్డ్ ట్రైనర్ సుబ్బారెడ్డి, HM శ్రీనివాసులు పాల్గొన్నారు.