MBNR: ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యార్థులను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అభినందించారు. ఉన్నత చదువుల్లో స్పష్టమైన లక్ష్యంతో కష్టపడితే విజయం సాధ్యమని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులను శాలువాతో సత్కరించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.