JN: పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన ఎర్త్ డే పోస్టర్ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపుపై ప్రజలు చైతన్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీలలో పోస్టర్ ప్రదర్శించి అవగాహన పెంచాలని అధికారులకు ఆదేశించారు.