PPM: కొమరాడ మండలంలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. రాజ్యలక్ష్మి పెట్రోల్ బంకు వద్ద వాహనదారులతో కలిసి నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ.. ఇంధన కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సరఫరా పెంచి సమస్యను పరిష్కరించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.