SRPT: హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని మఠంపల్లి మండలం మంచ్య తండ గ్రామ పరిధిలో లిఫ్ట్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో మట్టి రోడ్ల పనులు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టారు. మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్యా మంజు నాయక్ సహకారంతో సర్పంచ్ మాలోతు భద్రమ్మ బాబు నాయక్ పనులను ప్రారంభించారు.