బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి తనను మోసం చేసిందని బాధితుడు ధర్మేంద్ర ఆరోపించాడు. ఇండియా, యూకేలలో లోన్లు తీసుకుని మరీ ఆమె కోసం ఖర్చు చేశానని, తీరా డబ్బులు అడిగితే లేదా పెళ్లి ప్రస్తావన తెస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేసిందని, కేసు పెడతానంటే బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన వెల్లడించాడు.