ADB: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇచ్చోడ గిరిజన పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వరదలకు దెబ్బతిన్న పాఠశాల ప్రహరీ గోడను పరిశీలించి, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో సమీక్షించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.