సిద్ధూ జొన్నలగడ్డ, వెంకీ అట్లూరి కాంబోలో నెట్‌ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ సిద్ధమవుతోంది. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి ఎంపికైనట్లు టాక్. సిద్ధూ ఎనర్జిటిక్ బాడీ లాంగ్వేజ్‌కు, మీనాక్షి గ్లామర్, పర్ఫార్మెన్స్ తోడైతే స్క్రీన్ మీద కెమిస్ట్రీ అదిరిపోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఫ్రెష్ కాంబో ఈ సిరీస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని తెలిపాయి.