NRPT: ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని గ్రామపంచాయతీ కార్యదర్శి కృష్ణారెడ్డి, సర్పంచ్ మురళి తెలిపారు. మంగళవారం మరికల్ మండలం చిత్తనూరు గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో తాగునీరు అందించడమే లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.