ATP: గుత్తిలో నకిలీ వంద నోటు కలకలం రేగింది. చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మాయగాళ్లు దర్జాగా చలామణి చేస్తున్నారు. పట్టణంలోని అమృత థియేటర్ సమీపంలో గల టిఫిన్ సెంటర్లో వంద రూపాయల నకిలీ కరెన్సీ కలకలం సృష్టించింది. టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు వలి మాట్లాడుతూ.. హోటల్లో జనాల రద్దీ ఉండడంతో ఓ వ్యక్తి టిఫిన్ చేసి ఈ వంద రూపాయల నోటును ఇచ్చి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు.