అన్నమయ్య: ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ అడిషనల్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డా. ఎల్. రాధిక హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.