సత్యసాయి: రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ తెలిపారు. గురువారం గోరంట్ల మండలం కమ్మవారి పల్లెలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన రైతులకు అందజేశారు. భూములు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా సర్వే చేయించుకోవాలని సూచించారు.