GNTR: తెనాలి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు ఆకస్మికంగా సోమవారం ఉదయం పర్యటించారు. బుర్రిపాలెం రోడ్డులోని మున్సిపల్ కంపోస్ట్ యార్డును సందర్శించి, చెత్త తరలింపు, నిర్వహణను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎస్టీపీ ప్లాంట్ను, 11వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించారు.