NDL: శ్రీశైలం నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఛైర్మన్గా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆత్మకూరు మండలం కరివేనలో కార్యాలయాన్ని ప్రారంభించారు. పేదరిక నిర్మూలన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో చెంచు గిరిజనులకు కుట్టు యంత్రాలు, టార్పాలిన్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.