ATP: అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం గురువారం జరిగింది. DMHO డాక్టర్ దేవి, ప్రోగ్రాం ఆఫీసర్ విష్ణుమూర్తి ముఖ్య అతిథులుగా హాజరై ఆటిజం లక్షణాలు, ముందస్తు గుర్తింపుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ ఏడాది 120 మంది చిన్నారులను గుర్తించి ఉచితంగా చికిత్స, కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.