KDP: విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసులు అధికారులకు సూచించారు. ఇవాళ పులివెందులలోని స్థానిక విద్యుత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం, సోలార్ ప్రాజెక్టు పనులు, విద్యుత్ సేవల పురోగతి తదితర వాటిపై సమీక్షించారు. పగటిపూట వీధిలైట్లు వెలగకుండా చూడాలన్నారు.