AKP: ఎటువంటి ఒత్తిడికి గురి కావద్దని పదవ తరగతి విద్యార్థులకు డీఈవో అప్పారావు నాయుడు సూచించారు. శనివారం పాయకరావుపేట మండలం మంగవరం జడ్పీ హైస్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. ప్రశ్నా పత్రం చదివి తెలిసిన ప్రశ్నలకు ముందు సమాధానాలు రాయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక బాగా ఉపయోగపడుతుందన్నారు.