ATP: నార్పల మండలంలోని గూగుడు కుళ్లాయి స్వామి దేవస్థానంలో తలనీలాల పోగు చేసుకునే హక్కును ఈ నెల 28న వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శోభ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 28 మంగళవారం ఉదయం 10 గంటలకు ఆలయం వద్ద బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు లక్ష రూపాయల డిపాజిట్ చెల్లించి పాటలో పాల్గొనాలన్నారు.