SKLM: జిల్లా కేంద్రంలో అతిసార వ్యాధి కేసులు నమోదు కావడంతో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. వ్యాధి ప్రభావంపై సమీక్షించిన అనంతరం బాధితులకు తక్షణమే మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వ్యాధి వ్యాప్తి మూలాలను గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.