W.G: కాలువలో స్నానానికి దిగిన పదవ తరగతి విద్యార్థి గణపతిరాజు సాహిల్ కుమార్ (16) మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇరగవరం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన సాహిల్ కుమార్తో పాటు పదిమంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు అయిపోయాయనే ఆనందంతో కలిసి మండపాక నుంచి రేలంగి వెళ్లే రోడ్డులో కాలువలో స్నానానికి దిగారన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.