W.G: నరసాపురం మండలం యర్రంశెట్టివారిపాలెంలో కూనపురెడ్డి సంజీవ్రావుపై దాడి చేసిన ఐదుగురిపై రూరల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్సై టీవీ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 22న ఆదివారం కుటుంబ కలహాల నేపథ్యంలో సంజీవ్రావుపై ఆయన కోడలు నవ్యరాణి, ఆమె బంధువులు కోటిపల్లి అబ్బాయి, సురేష్, రామకృష్ణ మరి కొందరితో కలిసి దాడికి పాల్పడ్డారు.