విశాఖలో 20 మంది ట్రాన్స్జెండర్లు గురువారం పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. జీవీఎంసీ స్వీపర్ ఉద్యోగాల్లో చేరిన వారికి 72 రోజుల జీతం జమ కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. సీపీని పూలమాల, శాలువాతో సత్కరించారు. ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే గౌరవప్రద జీవనం సాధ్యమని సీపీ అన్నారు.