VKB: ఎన్నారం గ్రామంలో మాజీ MLA ఆనంద్ రైతుల జొన్న పంటను శనివారం పరిశీలించారు. ప్రభుత్వం జొన్నలకు రూ.3,690, మొక్కజొన్న క్వింటాలకు రూ.2,400 మద్దతు ధర నిర్ణయించింది. కానీ రైతుల నుంచి దాన్యం కొనకపోవడంతో దళారుల చేతిలో తక్కువకు అమ్ముకుని రైతులు దారుణంగా మోసపోతున్నారని అన్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు జొన్నలు కొనుగోలు చేయాలని ఆనంద్ డిమాండ్ చేశారు.