AP: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుని మీడియా రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. తొలుత 3 భాషల్లో డిజిటల్ ప్లాట్ఫామ్, తర్వాత తెలుగులో న్యూస్ ఛానెల్ ఏర్పాటు చేయనున్నారు. ఏ పార్టీకి అనుబంధంగా ఉండకుండా, సామాన్యుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. త్వరలోనే ఈ మీడియా సంస్థ పేరును వెల్లడించనున్నారు.