TG: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే అభివృద్ధి పేరిట పేదల ఇళ్లు కూలిస్తే సహించేది లేదని మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన తెలియజేశారు. పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.