తమిళనాడులో స్టార్ హీరోలు రజినీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. డీజీపీ కార్యాలయానికి వచ్చిన ఈమెయిల్‌తో అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్‌తో కలిసి పోయిస్ గార్డెన్లో ముమ్మరంగా సోదాలు చేశారు. గంటన్నర తనిఖీల తర్వాత ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అది ‘ఫేక్ కాల్’ అని తేల్చారు. దీంతో అభిమానులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.