గుంటూరు: తెనాలి మండలం పెదరావూరు గ్రామ స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ గోపాలకృష్ణ గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఉదయాన్నే గ్రామానికి వచ్చిన ఆయన సైకిల్‌పై తిరుగుతూ సమస్యలను పరిశీలించారు. ప్రజలను అడిగి ఇబ్బందులను తెలుసుకున్నారు. పలుచోట్ల రోజుల తరబడి వ్యర్థపు గుట్టలు తొలగించకుండా రోడ్లపై ఉండటం చూసి సిబ్బందిని ప్రశ్నించారు.