ఏలూరు: జిల్లాను డ్రగ్స్ రహితంగా మారుస్తానని చెప్పిన ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా మారడం సిగ్గుచేటని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు విమర్శించారు. ఇవాళ ఏలూరులో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ డ్రగ్స్ పార్టీగా మారిపోయిందని తీవ్రంగా ఆరోపించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రానికి చెడ్డపేరు తెస్తున్నాయని అన్నారు.