AKP: అనకాపల్లి పట్టణం లెపర్సీ కాలనీలో 50 మందికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లను నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు శనివారం పంపిణీ చేశారు. వృద్ధాప్య వితంతు వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సామాజిక పింఛన్లు దోహదపడుతున్నాయని అన్నారు. రేపు ఆదివారం కావడంతో ఒక రోజు ముందే పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.