అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో ‘వృషకర్మ’ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే మార్చి తొలివారంలో ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు స్టార్ట్ చేశారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.