సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్టులో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ.. తైక్వాండోతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పలు రంగుల బెల్టులను అందజేశారు.