MDK: రామాయంపేట మండలం శివాయపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని నిర్వాహకులు తెలిపారు. దళారులను నమ్మి మోసపోకుండా, రైతులందరూ తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరను పొందాలని కోరారు.