ASR: జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ చైర్పర్సన్ డా. కంబిడి కృష్ణకుమారికి అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిర్వహిస్తున్న సేవలను ప్రశంసిస్తూ ఆదివారం శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా మహిళల సమస్యల పరిష్కారంలో ఫిర్యాదుల కమిటీ పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.