AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి అప్డేట్ ఇచ్చారు. ‘కళ్యాణ్ బాబుకు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షేమంగా, నిలకడగా ఉంది. వేగంగా కోలుకుంటున్నారు. మరో వారం రోజుల్లో తిరిగి సాధారణ విధుల్లో పాల్గొంటారని వైద్యులు తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దు’ అని చిరంజీవి పేర్కొన్నారు.